మెగా కుటుంబంపై  సోషల్ మీడియా ట్రోల్స్‌ కు గట్టి కౌంటర్ ఇచ్చిన  లావణ్య త్రిపాఠి

Spread the love

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ట్రోల్స్‌కు మెగా కోడలు లావణ్య త్రిపాటి గట్టి కౌంటర్ ఇచ్చారు. సంతోషకరమైన క్షణాలను విషపూరితంగా మార్చొద్దని, తెలియని విషయాలపై వ్యాఖ్యలు చేయడం మానేయాలని స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో కొంతమంది చేసిన అవగాహనలేని వ్యాఖ్యలపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి గట్టిగా బదులు ఇచ్చారు.  ఆమె స్పందిస్తూ సాధారణంగా ఇలాంటి ట్వీట్లను పట్టించుకోకుండా వదిలేస్తానని అయితే ఈసారి మాత్రం స్పందించక తప్పలేదని తెలిపారు. ఒక సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన అని ఆమె స్పష్టం చేశారు. చిరంజీవి కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా తన మనవరాళ్లను ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో విమర్శలు చేసే వారికి అసలు అవగాహనే లేదని పేర్కొన్నారు. చిరంజీవి చేసే సేవలు, కుటుంబానికి ఇచ్చే విలువ చాలా మందికి సాధ్యం కానివని లావణ్య త్రిపాఠిఅన్నారు. కనీసం ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వారు, ఆయన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆమె ఘాటుగా హెచ్చరించారు. ఎవరి గురించి పూర్తిగా తెలియకుండానే సోషల్ మీడియాలో తీర్పులు ఇవ్వడం తప్పని, అలాంటి వారు ఇప్పటికైనా నోర్లు మూసుకుంటే మంచిదని హితవు పలికారు.