లండన్ లో పలు స్పోర్ట్స్ పార్క్ లను సందర్శించిన మంత్రి నారాయణ బృందం

Spread the love

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రెండో రోజు పర్యటనలో భాగంగా నగరంలోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ ను సందర్శించింది. 2012లో ఒలింపిక్స్ కోసం నిర్మించిన పలు స్పోర్ట్స్  పార్కులను మంత్రి పరిశీలించారు. ప్రధాన స్పోర్ట్స్ అయిన  ఫుట్ బాల్, రగ్బీ, బేస్ బాల్  పోటీలు నిర్వహించిన లండన్ స్టేడియంతో పాటు ఆక్వాటిక్స్ సెంటర్, హైడ్ పార్కు, లీ వ్యాలీ వేలో పార్కులో నిర్మాణాలను మంత్రి నారాయణ బృందం  అధ్యయనం చేశారు. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆయా స్టేడియాలను ఈమేరకు పరిశీలించారు. అనంతరం ఖతార్ పర్యటనకు వెళ్లింది. మంత్రి నారాయణతో పాటు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.