మన శంకర వర ప్రసాద్ తో ఈ సంక్రాంతికి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించడమే కాకుండా భారీ విజయంతో తెలుగు ఇండస్ట్రీకి గట్టి జోష్ ఇచ్చారు మన మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈచిత్రం రోజుకొక సరికొత్త రికార్డుతో దూసుకుపోతోంది. లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ ప్రకారం ఐతే, ఆల్మోస్ట్ 300 కోట్ల కు చేరువ అయ్యింది… జస్ట్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు 292 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ గా దూసుకెళ్తుంది! ప్రాంతీయ చిత్రాలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా దూసుకుపోతుంది. 3 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయిన ఒక ప్రాంతీయ చిత్రంగా కూడా నిలిచింది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ దుమ్ముదులిపేస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకూ 2.96 మిలియన్ డాలర్లు వసూలు చేసి 3 మిలియన్ల డాలర్ల క్లబ్లో చేరేందుకు అతి చేరువలో ఉంది. మెగాస్టార్ కెరీర్లోనే 3 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా ‘ఈ మూవీ నిలిచింది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి కూడా మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఇప్పుడు చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో వరుస సంక్రాంతి విజయాలతో సత్తా చాటారు. ఈ రెండు సినిమాలు రెండు వందల కోట్లు సాధించడంతో వరుసగా రెండు సంవత్సరాల్లో వరుసగా రెండు రూ.200 కోట్ల సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ గా హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు.