గ్రీన్ ల్యాండ్ పై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు  

Spread the love

ఎన్నో కీలక వనరులకు నిలయమైన గ్రీన్ ల్యాండ్ ను దక్కించుకునేందుకు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న చర్యలకు పలు దేశాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రీన్ ల్యాండ్ ఐలాండ్ ను దక్కించుకుంటామని ట్రంప్ హెచ్చరికలను గ్రీన్ ల్యాండ్, డెన్మార్క్ తో పాటు యూరోపియన్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్ పై అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి గ్రీన్ ల్యాండ్ కు ముప్పు ఉందని నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) దేశాలు చెబుతున్నప్పటికీ డెన్మార్క్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని రష్యా ను ఎదొర్కొవడంలో విఫలమైందని అందుకే సెక్యూరిటీ కారణాల వలన తాము ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎలాగైనా గ్రీన్ ల్యాండ్ ను దక్కించుకుంటామని అన్నారు. సమయం వచ్చింది కాబట్టే తాము కల్పించుకుంటున్నామని ట్రంప్ అన్నారు. ఇక ఈ అంశంలో తమని వ్యతిరేకించే దేశాలపై టారిఫ్ లు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ స్పందించారు. ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదని గ్రీన్ ల్యాండ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమని పేర్కొన్నారు.