వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో నితిన్ కొత్త మూవీ

Spread the love

నితిన్ కథానాయకుడిగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలిపింది.  ఎన్నడూ వినని ఒక కథ. ఎన్నడూ పొందని ఒక అనుభవం.డైనమిక్ డ్యూ నితిన్ & డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ కాంబినేషన్ నుండి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ ఫిక్షన్ కథ. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ‘ఊరు పేరు భైరవ కోన’ వంటి మంచి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆనంద్ దర్శకత్వంలో వస్తుండడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. అంతకు ముందు ఆయన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ఒక్క క్షణం, డిస్కో రాజా, వంటి చిత్రాలతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. గత సంవత్సరం నితిన్ నటించిన  ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ చిత్రాలు విడుదలయ్యాయి.