దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాలు కవాతు ప్రారంభించాయి. వివిధ హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులతో అశ్వికదళం మొదటిసారి ఈ పరేడ్ పాల్గొంది. యూరోపియాన్ యూనియన్ కు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శనలిచ్చింది. దేశ అభివృద్ధి ప్రస్థానం, కల్చరల్ డైవర్సిటీ, సైనిక బలం, ఆపరేషన్ సిందూర్ లో వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరప్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్సెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు, భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలను వేలాది మంది వీక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)ను సందర్శించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కిన ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అత్యున్నత శౌర్య పురస్కారం ‘అశోక చక్ర’ను ప్రదానం చేశారు. భారత్ సొంతంగా చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఎంపికైన మరో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ‘కీర్తి చక్ర’ను ప్రదానం చేశారు.