బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు వేడుకల్లో తనదైన శైలిలో అందరి మనసు గెలుచుకున్నారు. ఈ వేడుకకు హాజరైన తన సన్నిహితులు, స్నేహితుల కోసం సల్మాన్ స్వయంగా చెఫ్ గా మారి ఆశ్చర్యపరిచారు.తాజాగా రితేష్ దేశ్‌ముఖ్ కోసం సల్మాన్ స్వయంగా తన ప్రత్యేక వంటకం ‘భౌ చి భేల్’ (Bhau Chi Bhel) ను తయారు చేశారు.కేవలం వంట చేయడమే కాకుండా, పదార్థాలను కలపడం నుండి ప్లేట్లలో వడ్డించే వరకు ప్రతి పనినీ దగ్గరుండి చూసుకున్నారు.ఒక స్టార్ హోదాలో ఉండి కూడా, ఇంతటి ఆత్మీయతతో స్వయంగా వడ్డించడం సల్మాన్ ఖాన్ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.సల్మాన్ ఖాన్ లోని ఈ నిరాడంబరత ,ఆతిథ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.