విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్…? 

Spread the love

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహానికి సంబంధించి ఎట్టకేలకు ఒక స్పష్టమైన అప్‌డేట్ వచ్చేసింది.గత కొన్నేళ్లుగా వీరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ, 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చారిత్రక ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి జరగనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.కాగా ఈ జంటకు 2025 అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో అత్యంత రహస్యంగా నిశ్చితార్థం జరిగింది.

అయితే ఉదయ్‌పూర్‌లో జరగబోయే వివాహ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని, ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.ఇటీవల రష్మిక తన స్నేహితులతో కలిసి శ్రీలంక ట్రిప్‌కు వెళ్లడంపై కూడా అది తన ‘బ్యాచిలొరెట్ పార్టీ’ అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.తాజా ఇంటర్వ్యూలలో రష్మిక ఈ వార్తలను ఖండించకపోవడం, విజయ్‌ను తన ‘బ్లెస్సింగ్’ అని సంబోధించడం చూస్తుంటే ఈ ఫిబ్రవరిలో ‘డ్రీమ్ వెడ్డింగ్’ ఖాయమని తెలుస్తోంది.