టాలీవుడ్ సెన్సేషనల్ హీరో, ‘టిల్లు’ ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ , ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో మెప్పించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం అధికారికంగా అనౌన్స్ అయ్యింది.ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.తాజాగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.ఒక పల్లెటూరి వాతావరణం, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న మెషిన్ గన్ చూస్తుంటే, ఈ సినిమా ఒక వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ లేదా డార్క్ కామెడీగా ఉండబోతుందని అర్థమవుతోంది.’టిల్లు’ మార్క్ టైమింగ్, స్వరూప్ మార్క్ ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లే తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో సాలిడ్ హిట్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.