న్యూ ఇయర్ జోష్: అర్ధరాత్రి ఒంటిగంట వరకు హైదరాబాద్ మెట్రో సేవలు!

Spread the love

కొత్త ఏడాది వేడుకల వేళ హైదరాబాద్ ప్రయాణికులకు ఎల్&టీ మెట్రో రైలు సంస్థ శుభవార్త అందించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు జరిగే వేడుకల దృష్ట్యా, మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రాత్రి 11 గంటలకే ముగిసే సర్వీసులు, బుధవారం రాత్రి ప్రారంభ స్టేషన్ల నుండి అర్ధరాత్రి ఒంటిగంట (1:00 AM) వరకు అందుబాటులో ఉంటాయి. ప్యాసింజర్లు తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకునేలా చివరి రైలు గమ్యస్థానానికి చేరుకునే వరకు అంటే దాదాపు తెల్లవారుజామున 2 గంటల వరకు స్టేషన్లు తెరిచి ఉంటాయి. భద్రత దృష్ట్యా మెట్రో స్టేషన్లు, రైళ్లలో పోలీసుల నిఘా మరియు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో మెట్రో సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మెట్రో సంస్థ కోరింది.