తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’ ట్రైలర్ ఆదివారం విడుదలైంది.ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం, 1960లలో తమిళనాడును కుదిపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందింది.రైల్వే ఉద్యోగి అయిన ఒక సామాన్యుడు, తన భాషా అస్తిత్వం కోసం ఒక విప్లవ వీరుడిగా ఎలా మారాడు అనే అంశాన్ని ఈ ట్రైలర్‌లో పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో చూపించారు.మనం హిందీ మాట్లాడే వారికి వ్యతిరేకం కాదు, హిందీ బలవంతపు రుద్దుడుకు మాత్రమే వ్యతిరేకం అనే సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ చిత్రంలో రవి మోహన్ ప్రతినాయకుడిగా నటించగా, అధర్వ మురళీ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది.