వినుకొండ పట్టణంలో పొగాకు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. కారంపూడి రోడ్డు నుంచి శివయ్య స్తూపం వరకు సాగిన ఈ ప్రదర్శనలో వందలాది మంది రైతులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పొగాకు ఉత్పత్తులపై పెంచిన భారీ జీఎస్టీని వెంటనే తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. పన్నుల భారం వల్ల సామాన్య రైతులు కుదేలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విదేశాల నుంచి దేశంలోకి వస్తున్న అక్రమ సిగరెట్ల రవాణాను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని కోరారు. అక్రమ వ్యాపారం కారణంగా మార్కెట్‌లో దేశీ పొగాకుకు ఆదరణ తగ్గి తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఈసందర్భంగా రైతన్నలు వాపోయారు.ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు నాయకులు స్పష్టం చేశారు.