స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై తెలుగు సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ ట్రైలర్ పై మహేశ్ స్పందించారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో ఆమె నటనను మెచ్చుకున్నారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రియాంక చోప్రా మరోసారి కాంప్రమైజ్ కాని, అద్భుతమైన నటన కనబరిచారు. ఫిబ్రవరి 25న విడుదలవుతున్న ‘ది బ్లఫ్’ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అంటూ మహేశ్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ది బ్లఫ్’ చిత్రం 1800ల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇందులో ప్రియాంక ఒక అద్భుతమైన పాత్రలో కనిపించనున్నారు. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే తల్లిగా ఆమె నటన ట్రైలర్లో ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకులు రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.ఇక మరోవైపు మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా తొలిసారిగా కలిసి ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ గర్వించదగిన డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో వీరిద్దరూ అలరించనున్నారు.