భారత్ పై అమెరికన్ టారిఫ్ లు తగ్గే అవకాశం?

Spread the love

భారత్ అమెరికా మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విధించిన సుంకాలు సగానికి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈమేరకు ఒక హింట్ ఇచ్చారు.  రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్  టారిఫ్ లు (25 శాతం) విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాకు భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్ లు  అమలవుతున్నాయి. అయితే తాజాగా స్కాట్ బెసెంట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు భారత్ పై  25 శాతం సుంకాలు విధించాం. అయితే రష్యా ఆయిల్  కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది. ఇప్పటికీ టారిఫ్ లు అమల్లో ఉన్నాయి. వాటిని తగ్గించేందుకు ఒక మార్గం ఉందని నేను అనుకుంటున్నానని సుంకాల తొలగింపు గురించి ఆమె పరోక్షంగా తెలిపారు.