ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్కౌంటర్.. 14మంది మావోయిస్టుల మృతి

Spread the love

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో నేడు భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.  మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మరో ఎన్కౌంటర్లో ఇద్దరు మృతి చెందారు.మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కిష్టారం పోలీసు స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం సుక్మా జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) సెర్చ్ ఆపరేషన్ ను మొదలెట్టింది. ఈ క్రమంలో పామూరు గ్రామం సమీపంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.  మరోవైపు.. బీజాపుర్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. గత ఏడాది జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 285 మందికి పైగా మావోయిస్టులు మరణించారు.