బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 సోదరుడు, మాజీ యువరాజైన ఆండ్రూ మౌంట్ బాటన్-విండ్సర్ (66) అరెస్టు అయ్యారు. అమెరికాలో లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్ స్టీన్ తో సంబంధాలున్న కారణమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనే ఆయనకు అధికార హోదాను కూడా కింగ్ తొలగించారు. దీంతో అతని యువరాజు హోదా పోయింది. అధికార నివాసాన్నీ ఖాళీ చేశారు. ఆండ్రూ అరెస్టుపై బకింగ్హాం ప్యాలెస్ నుంచి కింగ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆండ్రూ అరెస్టు పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాం. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక సరైన అధికార యంత్రాంగం ద్వారా పూర్తి స్థాయి, పారదర్శక, సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఛార్లెస్-3 తెలిపారు.