మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఎంతటి భారీ అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే పలుమార్లు వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇప్పుడు ఒక కీలక అప్డేట్ ను మూవీ టీమ్ పంచుకుంది. ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసే డేట్ ను తెలిపింది. మే 18న ఈ మూవీ నుండి ట్రైలర్ ను విడుదల చేయనుంది. ఈ మేరకు ఒక పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో అభిమానులలో ఫుల్ జోష్ నింపింది. ఇక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకరోజు ముందుగానే విదేశాల్లో సందడి చేయనుంది. తాజాగా అక్కడ ముందస్తు టికెట్ బుకింగ్స్ భారీ స్థాయిలో సేల్ అయ్యాయి. 24 గంటలు కూడా కాకముందే లక్ష టికెట్స్ సేల్ అయి ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏస్థాయిలో ఉందో చెప్పేశాయి. దీంతో నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా ఇన్ని టికెట్స్ అమ్ముడైన తొలి సినిమాగా ‘పెద్ది’ చరిత్ర సృష్టించింది. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఈ రేంజ్ లో టికెట్లు సేల్ అయ్యాయంటే ట్రైలర్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా రోజులు ఉండడంతో అప్పటివరకూ మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై రూపొందుతోంది. శృతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో నటించనున్నట్లు తెలుస్తోంది.