రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గానీ శాశ్వత మిత్రులు గానీ ఉండరనేది జగమెరిగిన సత్యం. ఢిల్లీ-హైదరాబాద్ ల మధ్య సరికొత్త స్నేహం వెల్లివిరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల బెంగాల్ గెలుపు ఉత్సాహంతో సౌత్ వైపు చూస్తున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణను తమ తదుపరి లక్ష్యంగా మార్చుకున్నట్లే కనిపిస్తోంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన కేవలం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మాత్రమే కాదు..రానున్న రోజుల్లో జరిగే రాజకీయ మార్పులకు ఇది సంకేతమా? ‘నాతోనే కలవండి అనే మాట వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటా అని తెలంగాణ రాజకీయ యవనికపై ఇప్పుడు సరికొత్త పొలిటికల్ స్ట్రాటెజీల పర్వం మొదలైంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమమేనా రాబోయే ఎన్నికలకు ఒక బలమైన శంఖారావంగా మారిందా అనే ప్రశ్నను లేవనెత్తింది. బెంగాల్ ఇచ్చిన గెలుపుతో సౌత్ లో మరింత విస్తరించాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది. హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా గుజరాత్ తరహాలో తెలంగాణకు నిధులు కావాలని అడగటం గమనార్హం. అలాగే రేవంత్ చేసిన విజ్ఞప్తికి మోదీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. గతంలో గుజరాత్ కు వచ్చిన నిధుల కంటే ఎక్కువే ఇస్తున్నామని, నా దగ్గరికే రమ్మని మోదీ పిలుపునివ్వడం వెనుక పెద్ద రాజకీయ మర్మమే ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ ‘నాతో కలవండి’ అన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. రాజకీయ వర్గాల్లో ఈ కామెంట్స్ సరికొత్త చర్చకు ముందు ముందు జరిగే పొలిటికల్ ఈక్వేషన్స్ కు దారితీస్తాయో అనే చర్చ ఊపందుకుంది.ప్రధాని మోదీ బహిరంగ సభలో చేసిన ప్రసంగం కంటే రేవంత్‌రెడ్డికి ఇచ్చిన ఆఫర్ పైనే అందరి దృష్టి నిలిచింది. అభివృద్ధి విషయంలో తనతో కలిసి నడవాలని మోదీ కోరడం వెనుక రాజకీయంగా కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టే ఎత్తుగడ ఉండొచ్చు. సీఎం రేవంత్ తెలంగాణకు కావాల్సిన అంశాలపై గట్టిగా తన గళం వినిపిస్తున్నారు. మోదీ వ్యాఖ్యలను విశ్లేషిస్తే, తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల రాష్ట్రానికి లాభం జరుగుతుందా లేక రాజకీయంగా బీజేపీకే మైలేజ్ వస్తుందా అనేది రానున్న రోజుల్లో చూడాలి. ఇక ఈ పర్యటనలో ప్రధాని మోదీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేయడం చెప్పడం ద్వారా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ వ్యూహాలు ఇప్పుడు క్షేత్రస్థాయికి చేరేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మోదీ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చేరికలు, మార్పులు ఉండబోతున్నాయని సంకేతాలు అందుతున్నాయి. భవిష్యత్ లో తెలంగాణ వేదికగా మరిన్ని ఆసక్తికర పోరాటాలు జరగడం ఖాయమనిపిస్తోంది.అసలు మోదీ ‘నాతో కలవండి’ అని ఎందుకు అన్నారనే దానిపై రాజకీయ పండితులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అది కేవలం అభివృద్ధి కోసమా లేక రాజకీయ పొత్తుల కోసమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హడావుడి పడకుండా లోతుగా ఆలోచిస్తే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయడానికే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని కొందరంటున్నారు. కేంద్రం ఇచ్చే మద్దతును గుర్తిస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొత్త చర్చకు దారితీశాయి. మొత్తానికి ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక చర్చకు ఆస్కారాన్నిచ్చింది.ప్రధాని మోదీ ‘మేరే సేహీ జుడో’ అన్న మాట ఒక సాదాసీదా ఆహ్వానమా? లేక తెలంగాణ రాజకీయాల్లో రాబోయే పెనుమార్పులకు ఇది నాందియా? కాలమే సమాధానం చెప్పాలి.