ఆటే నా పొగరు అంటున్న రామ్ చరణ్..అదిరిపోయిన ‘పెద్ది’ ట్రైలర్!

Spread the love

తెలుగు సినిమాకు కొంత గ్యాప్ తరువాత రాబోతున్న పెద్ద సినిమా ‘పెద్ది’. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. థియేటర్ల వద్ద సందడి కనిపించి చాలా రోజులవుతోందే అని సినీ ప్రేమికులు అనుకుంటున్న వేళ ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా విడుదల కాబోతోంది. కాగా, నేడు ట్రైలర్ విడుదలైంది. అనుకున్నట్లుగానే ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలను పెంచే విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. క్రికెటర్ గా, రెజ్లర్ గా, అథ్లెట్ గా  అద్భుతమైన క్రీడా నేపథ్యం ఉన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అదరగొట్టేశారు. ఆటే నా పొగరు అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో రచ్చలేపారు. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు..నేను పోరాడాను సారూ అంటూ చరణ్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ కదిలించాయి. మొత్తానికి ‘పెద్ది’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక అద్భుతమైన సినిమాగా నిలవనుంది అనేది ఈ ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం ఇప్పటికే పాటలతో ఆకట్టుకోగా..ట్రైలర్ లో కూడా మంచి ఎనర్జిటిక్ మ్యూజిక్ తో ఆకట్టుకునేలా ఉంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, సమర్పకులుగా వ్యవహరిస్తుండటం సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. ఇప్పటికే భారీ సినిమాలు నిర్మించి విజయాలు అందుకున్న ఈ సంస్థలు ‘పెద్ది’ని కూడా అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *