ఈ ఏడాది మొట్టమొదటి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి సంక్రాంతికి మరింత జోష్ ఇచ్చిన మూవీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్’. కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ మూవీ బృందానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తన అభినందనలు తెలిపారు. THE BOSS IS BACK – L-I-T! మన మెగాస్టార్ మళ్ళీ వెండితెరపై ఆ రేంజ్ లో చూడటం చాలా ఆనందంగా ఉంది. పక్కా VintageVibes! వెంకటేష్ గారు అదరగొట్టేశారు. వెంకీ గౌడ పాత్రలో మీరు చాలా బాగా నటించారు. అలాగే నయనతార గారి ప్రెజెన్స్, క్యాథరిన్ ట్రెసా గారి హ్యుమరస్ పెర్ఫార్మెన్స్, మరియు సంక్రాంతి స్టార్ ‘బుల్లిరాజు’ తో సహా నటీనటులందరి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అద్భుతమని అల్లు అర్జున్ కొనియాడారు. ఇక ఈలలు వేయించే పాటలు.. ముఖ్యంగా HookStep, MegaVictory. భీమ్స్ సిసిరోలియో గారికి, సాంకేతిక నిపుణులందరికీ, మరియు ముఖ్యంగా మా కజిన్ సుస్మిత కొణిదెల గారికి, సాహు గారపాటి గారికి అభినందనలు.సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెషీన్ అనిల్ రావిపూడి గారికి పెద్ద కంగ్రాచ్యులేషన్స్. సంక్రాంతికి వస్తారు – హిట్ కొడతారు – రిపీటు!ఇది కేవలం సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు… ఇది సంక్రాంతి “బాస్”-బస్టర్ అంటూ అల్లు అర్జున్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.