విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్

Spread the love

తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించే క్రేజీ స్టార్ నవీన్ పొలిశెట్టి, గ్లామర్ స్టార్  మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా  మూవీ ‘అనగనగా ఒక రాజు’. మారి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. హాస్యభరిత  కుటుంబ కథా చిత్రంగా  రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకునేలా ఉంది. హీరో నాగార్జున బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్ లో  నవీన్ పొలిశెట్టి లుక్, క్యారెక్టర్ పూర్తి వినోదభరితంగా కనిపించాయి. అతని కామెడీ టైమింగ్ మరోసారి స్పెషల్ అట్రాక్షన్ గా  నిలవగా, మీనాక్షి చౌదరి కూడా అలరించింది. ఇక ఈ ట్రైలర్ ను మీరు చూసి ఆనందించండి.