రోజు రోజుకు వెలుగు చూస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునే విధంగా కొందరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అత్యంత జుగుప్స కలిగించక మానదు. తాజాగా ప్రేమ మోజులో పడి ఒక కూతురు తన కన్నతల్లి, పెద్దమ్మ ప్రైవేటు ఫొటోలను మొబైల్ లో ప్రియుడికి పంపింది. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బెంగళూరుకు చెందిన ఓ యువతి (23)కి ఆన్లైన్ క్లాస్ ల కోసం తల్లిదండ్రులు ఓ స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ఇటీవల కూతురు ఓ యువకుడితో సన్నిహితంగా ఉన్నట్లు గమనించిన తల్లి తరచూ ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరని ప్రశ్నించగా… కూతురు దాటవేసే ప్రయత్నం చేసింది. దీంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఫోన్ అన్లాక్ చేసి ఇవ్వాలని తల్లి కోరగా ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో తండ్రి విషయం తెలుసుకుని, కూతురును మందలించి, ఫోన్ లాక్ ఓపెన్ చేసి చూసేసరికి దారుణ దృశ్యాలు కనిపించాయి. తల్లి, పెద్దమ్మల ప్రైవేటు ఫొటోలను వాట్సాప్ లో తన ప్రియు డికి కూతురు పంపినట్టు చూసిన తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. యువతి, ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.