హెయిర్ స్టైల్ చెడగొడితే..అంత పరిహారమా?ఏడేళ్ల నాటి కేసులో కీలక తీర్పు

Spread the love

హెయిర్ కటింగ్ చేసిన వారు దానిని చెడగొట్టారంటూ పెద్ద మొత్తంలో పరిహారం కోరిన ఘటనలో చివరికి ఏం జరిగింది. వివరాల్లోకి వెళితే ఆష్నారాయ్‌ అనే మోడల్‌ రూ.2 కోట్ల పరిహారం కోరారు. ఏడేళ్ల క్రితం నాటి ఈ కేసులో ఎన్‌సీడీఆర్‌సీ (జాతీయ వినియోగదారుల వివాద పరిష్కారాల కమిషన్‌) కూడా అంతమొత్తం చెల్లించాల్సిందేనంటూ ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం  తాజాగా ఈ తీర్పును తప్పుబడుతూ పరిహారాన్ని రూ.25 లక్షలకు తగ్గించింది. 2018లో ఆష్నారాయ్‌ ఢిల్లీలోని ఒక హోటల్‌లో ఉన్న సెలూన్‌కు వెళ్లి హెయిర్‌ కటింగ్‌ చేసుకున్నారు. అయితే, ఆ సెలూన్‌ వారు నిర్లక్ష్యంగా చేసిన పనితో  తన లుక్‌ పూర్తిగా మారిపోయి, గ్లామర్‌ పోయి తన కాన్ఫిడెన్స్  దెబ్బతిన్నదని, ఇది మోడలింగ్‌లో, సినిమాల్లో అవకాశాలపైనా ప్రభావం చూపించిందని, తనకు జరిగిన నష్టానికి పరిహారం కింద రూ.2 కోట్లు కావాలని కోరారు. ఎన్‌సీడీఆర్‌సీ కూడా ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే  ఆ సెలూన్ యాజమాన్యం సుప్రీంను ఆశ్రయించింది.