నేటి నుండి వెహికల్ షో రూంల (డీలర్ల) వద్ద నుండే వెహికల్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవాణా శాఖ లో నేటి నుండి మరిన్ని సంస్కరణలు అమలవుతున్నాయని వివరించారు. కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదని ఎక్కడ వాహనం కొంటే అక్కడ షో రూమ్ ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయబడుతుందన్నారు. ఈ శాఖలో అన్ని రకాల సేవలు ఆన్లైన్ లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సారథి లో చేరింది… దీని ద్వారా రవాణా సేవలు సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయన్నారు. రవాణా శాఖ ఈవి పాలసీ,స్క్రాప్ పాలసీ, తీసుకొచ్చింది.. రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చి రవాణా సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చిందని ప్రజలంతా సహకరించాలని కోరారు.