తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. క్యాలెండర్‌లో ఏళ్లు మారుతున్నాయి తప్ప కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన ప్రజల బతుకుల్లో మార్పు రావడం లేదని, రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా తిరోగమనంలో పయనిస్తోందని ఆయన మండిపడ్డారు.కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు పెడితే, నేడు రైతులు యూరియా కోసం క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే తెలంగాణ రాకముందు రోజులు మళ్లీ కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై బీఆర్ఎస్‌పై ఎన్ని కుట్రలు చేసినా అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదని, ప్రజల దీవెనలు తమకు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.గెలుపోటములు తాత్కాలికమని, తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా స్థానం శాశ్వతమని పేర్కొన్నారు. 2028లో తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యంగా కార్యకర్తలు సమరోత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం నిరంతరం