భారత్‌తో వాణిజ్య సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.రష్యా నుండి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తమకు సహకరించకపోతే, భారతీయ ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) విధిస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు.రష్యా ఇంధనంపై ఆధారపడటం తగ్గించాలని కోరుతున్న ట్రంప్,ఈ అంశాన్ని భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలతో ముడిపెట్టడం గమనార్హం.గతంలోనే ప్రధాని మోదీ రష్యా చమురును నిలిపివేస్తామని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొనగా,భారత ప్రభుత్వం ఆ వార్తలను అప్పట్లోనే ఖండించింది.ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు సాగుతున్న తరుణంలో, ట్రంప్ ఇలా టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించడం అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన కలిగిస్తోంది.రష్యాపై ఆంక్షల తీవ్రతను పెంచేందుకు భారత్‌పై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ పరిణామాలు భారత్-అమెరికా భవిష్యత్ ఇంధన & వాణిజ్య వ్యూహాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో చూడాలి.