హైదరాబాద్–సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వ చిహ్నాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. అయితే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వలన సికింద్రాబాద్‌కు చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉందని సికింద్రాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై… ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. నేడు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. చారిత్రకంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలుగా పెద్ద నగరంగా విస్తరించాయి. ఈ రెండు నగరాలు ప్రపంచవ్యాప్తంగా జంట నగరాలుగా పేరుపొందాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హామీల అమలును పక్కనపెట్టి కేవలం పేర్లు మార్చడంపైనే ఫోకస్ పెట్టారని దుయ్యబట్టారు. మొదట టీఎస్ తీసేసి టీజీ అన్నారు…ఆ తర్వాత తెలంగాణ తల్లిని మార్చారు…తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేశారు…అధికార చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్‌ను తీసివేశారు.వీటన్నిటి వలన ప్రజలకు ఏమాత్రం లాభం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల దగ్గరికి పాలన పోవాలని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని వికేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ప్రారంభించారు.కొత్త గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని సికింద్రాబాద్ ప్రజలు పోరాటం చేస్తున్నారు.అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను, ప్రజల అస్తిత్వాలను గుర్తు లేకుండా చెరిపివేయడం కోసం కాదని అధికారం ఇచ్చింది గ్యారెంటీలను అమలు చేయడానికి,ప్రజలకు మంచి చేయాలని సూచించారు.ఇప్పుడున్న పదవిలో ఎల్లకాలం కొనసాగడు రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఇప్పటికైనా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపివేసే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై రాహుల్ గాంధీ స్పందించాలని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఆయన గుర్తించాలని కే.టి.ఆర్ పేర్కొన్నారు. ఇంత దారుణంగా, అక్రమంగా, అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్తి అనే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పాలన్నారు.