రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న చిత్రం ‘వారణాసి’. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానున్నట్లు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ప్రకటించేశారు. తాజాగా చిత్ర బృందం ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విశేషాలు పంచుకుంది. 15 సంవత్సరాల కిత్రమే రాజమౌళి దర్శకత్వంలో చేయాల్సిఉంది. ఇప్పటికి అది కుదిరిందని మహేష్ బాబు తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన తర్వాత సంవత్సరం పాటు దీని స్క్రిప్ట్ పై ఆలోచించారు. కథ విని ఆశ్చర్యపోయానన్నారు. ఇప్పటివరకూ రాజమౌళి చేసిన అన్ని చిత్రాల కంటే ఇది డిఫరెంట్ గా ఉంటుందన్నారు. ఇందులో ఎన్నో అంశాలు ఉన్నాయి. యాక్షన్, అడ్వెంచర్, పురాణాలు, టైమ్ ట్రావెల్.. ఇలా ఎన్నో ఉన్నాయి. రాజమౌళి అభిమానిగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నానన్నారు. ఇందులో హీరోగా చేయడానికి మొదట్లో భయపడ్డాను. రాజమౌళి కథను వివరించిన విధానం తన భయాన్ని పోగొట్టిందన్నారు. ‘వారణాసి’లో లుక్స్ కోసం ఎన్నో రిహార్సల్స్ చేశాం. 2024 నుంచి ఈ పనిలోనే ఉన్నట్లు తెలిపారు. గతేడాది జర్మనీ కూడా వెళ్లాం. రాజమౌళి ప్రతి చిన్నఅంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. ఎన్నిసార్లు అయినా రిహార్సల్స్ చేస్తారు. నేను ఇందులో రాముడి పాత్ర పోషించాను. రాముడు అంటేనే హుందాతనం ఆ పాత్ర కోసం నిలబడే విధానం దగ్గర నుంచి పాత్రలో నటించడం వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. 2,3 నెలలు దానికోసమే కష్టపడ్డా రాజమౌళి నేను పరిగెత్తే స్టైల్ కూడా మార్చా దానికోసం 6 నెలలుట్రైనింగ్ తీసుకున్నాను. సినిమాలో రెండు షాట్ల కోసం ఇదంతా చేశాం. ఆయనకు సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. ఎన్నో వర్క్ షాప్ లు నిర్వహించారు. యూరోపియన్ స్కల్ప్చర్స్ పరిశీలించారని తెలిపారు. ఇక ఈ సినిమా భారీస్థాయిలో విడుదలవుతుందని చెప్పుకొచ్చారు.