మక్తల్ లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..ఘటన కలిచి వేసిందన్న తెలంగాణ బీజేపీ ఛీఫ్

Spread the love

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో కలకలం రేగింది. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలోని 6వ  వార్డు పరిధి చందాపూర్ గ్రామానికి చెందిన మహదేవప్ప (48) బీజేపీ నుండి కౌన్సిలర్ గా  పోటీ చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. మహాదేవప్ప ఆత్మహత్య ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఆత్మహత్యకు కాంగ్రెస్ అహంకారపూరిత రాజకీయాలు, మాఫియా బెదిరింపులే కారణమని ఆరోపించారు.