క్రీడా పద్మాలు: విజయ్ అమృత్ రాజ్ కు పద్మ భూషణ్, రోహిత్, హర్మన్ లకు పద్మశ్రీ

Spread the love

భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్ కు  దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ దక్కింది. ఇక క్రికెట్ లో  కెప్టెన్లుగా భారత జట్టుకు విశేష సేవలందించిన ప్రపంచకప్ లు అందించిన రోహిత్ శర్మ, ఉమెన్స్ క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్లకు పద్మశ్రీ పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా  పద్మ అవార్డులను ప్రకటించింది. భారత హాకీ మాజీ ఆటగాడు బల్దేవ్ సింగ్, మహిళల హాకీ మాజీ గోల్ కీపర్ సవిత పునియా, పారా హైజంపర్ ప్రవీణ్ కుమార్, పారా పవర్ లిఫ్టర్లు భగ్వాన్స్ రైక్వార్, పజనివేల్ లు కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. దిగ్గజ రెజ్లింగ్ కోచ్ జార్జియాకు చెందిన వ్లాదిమర్ మెస్త్వరిష్విలిని మరణానంతరం పద్మశ్రీ అవార్డుతో గౌరవించారు. సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బబ్లింగ్ పునియా, విజయ్ దహియా వంటి రెజ్లర్లకు అతడు కోచ్ గా  వ్యవహరించాడు.