మన దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ (AI)ఇంపాక్ట్ సదస్సులో మౌలిక వసతుల రంగంలో 250 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్లకు హామీలు లభించాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వీసీ/డీప్ టెక్ టెక్నాలజీలపై 20 బిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసేందుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారనీ తెలిపారు. ఈ శిఖరాగ్ర సదస్సులో 5 లక్షల మందికి పైగా విజిటర్స్ పాల్గొన్నారని పేర్కొన్నారు. సమిట్ ఢిల్లీ డిక్లరేషన్ పై 70కి పైగా దేశాలు ఇప్పటికే సంతకాలు చేశాయని వివరించారు. ఇక ఈ సంఖ్య 80 దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంశంలో ప్రధానమైన దేశాలన్నీ డిక్లరేషన్ పై సంతకాలు చేశాయని పేర్కొన్నారు.