ఎన్సీపీ కలిసిపోవాలని  అజిత్ కోరుకున్నారు..శరద్ పవర్ కీలక వ్యాఖ్యలు 

Spread the love

ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం విదితమే. కాగా, తదుపరి రాజకీయ పరిణామాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన సతీమణి సునేత్ర పవార్ డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ పరిణామాలపై సీనియర్ నేత అజిత్ పవార్ బాబాయ్ శరద్ పవార్ స్పందించారు. ఎన్సీపీ రెండు వర్గాల విలీనానికి అజిత్ పవర్ అనుకూలంగా ఉండేవారని పేర్కొన్నారు. విలీనంపై చర్చలు జరిగినట్లు తెలిపారు. ఫిబ్రవరి 12న రెండు వర్గాలు కలవాలని ఆయన కోరుకున్నట్లు శరద్ తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల జరిగిన ప్రమాదంతో ఆ చర్చలు ఆగిపోయినట్లు తెలిపారు. ఇక సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం గురించి తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. నాకు సమాచారం లేదు. ఈ పరిణామాల గురించి నాకు అవగాహన లేదు. సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ ఆ పార్టీలో కీలక నేతలు వారే ఆ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటారని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి లో శరద్ పవార్ ఎన్సీపీ భాగంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.