ఫిబ్రవరి 7 నుండి భారత్-శ్రీలంక దేశాల వేదికగా టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో క్రమంగా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రపంచకప్ లో పాల్గొనే తమ జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచకప్ లో మిచెల్ మార్ష్ సారధ్యంలో తమ జట్టు బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 7 నుండి మార్చి 9వరకు ఈ మెగా టీ 20 టోర్నీ జరగనుంది.
ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్ లెట్, కూపర్ కనోలి, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లీస్, ట్రావిస్ హెడ్, జోష్ హేజల్ వుడ్, జోష్ ఇంగ్లిస్, మ్యాథ్యు కుహ్నేమన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మ్యాథ్యు రేన్షా, మార్కస్ స్టోయినీస్, ఆడమ్ జంపా.