కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం

Spread the love

అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాష్ట్ర సీఎం ఆయన కుటుంబీకులపై భూమి ఆక్రమించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన హిమంత్ బిశ్వ శర్మ తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. నేను ఒక పత్రికా సమావేశం ద్వారా నాపై అసత్యమైన, దురుద్దేశపూర్వకమైన మరియు పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినందుకు గానూ, కాంగ్రెస్ నాయకులు జితేంద్ర సింగ్, భూపేష్ బఘేల్ మరియు గౌరవ్ గొగోయ్‌లపై ₹500 కోట్ల నష్టపరిహారం కోరుతూ ఈరోజు పరువు నష్టం దావా వేశాను అని పేర్కొన్నారు. అస్సాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ-కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.