తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 సీట్లలో బరిలోకి దిగనున్న బీజేపీ

Spread the love

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్నే కాకుండా మిగతా కార్యకలాపాలను వేగవంతం చేశాయి. ఇక అక్కడ ప్రధాన పోటీ కూటమిగా ఉన్న ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన బీజేపీ 27 స్థానాల్లో పోటీచేయనున్నట్లు నేతలు ప్రకటించారు. ఆ కూటమిలోని  పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) 18 చోట్ల, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) 11 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. ఇక ఈ కూటమిలో అతిపెద్ద భాగస్వామి అన్నాడీఎంకే మాత్రం ఇంకా ఎన్ని స్థానాల్లో పోటీచేస్తుందనే దానిపై ఎటువంటి విషయాన్ని తెలుపలేదు. అయితే ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీనే బరిలో నిలవనుంది.  ఇక అధికార డీఎంకే తన మిత్ర పక్షమైన కాంగ్రెస్ కు 28 సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లున్నాయి. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా..మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రాష్ట్రంలో డీఎంకే, ఎన్డీయేల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో త్రిముఖ పోటీ ఉండనుంది. అయితే ఆ పార్టీ ఏమేరకు ప్రజలను ఆదరణ పొందుతుందనేది చూడాల్సి ఉంది. మొత్తానికి తమిళనాట ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *