విదేశీ విద్యపై తగ్గిన క్రేజ్: గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య!

Spread the love

హయ్యర్ ఎడ్యుకేషన్  కోసం విదేశాలకు వెళ్లే భారతీయ స్టూడెంట్స్ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత రెండేళ్లలో ఆ సంఖ్యలో 31 శాతం తగ్గుదల కనిపించడం విదేశీ విద్యపై ఆసక్తి తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది.  ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ గణాంకాలను తెలిపింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి సుకాంత మజూర్దార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.2023లో ఉన్నతవిద్య కోసం 9.08 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్లారు. 2024లో ఆ సంఖ్య 7.7 లక్షలకు తగ్గింది. 2025లో ఇది ఇంకొంచెం తగ్గి 6.26 లక్షలకు చేరింది. విదేశాల్లో చదువు అనేది వ్యక్తిగత విషయం. ఫైనాన్సియల్ కెపాసిటీ, బ్యాంకు లోన్స్ తీసుకోవడం, ఒక ప్రత్యేక విభాగంలో అధ్యయనం చేయాలనే ఆసక్తిపై అది ఆధారపడి ఉంటుందని విజయవంతమైన ఎన్నారైలు భారత్ కు  ఒక ఆస్తి. వారి సామర్థ్యాన్ని వినియోగించుకునేలా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. అలాగే భారత్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే లక్ష్యంతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)-2020 కింద ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వివరించారు.