ఇటీవల ప్రధాని మోడీని లోక్ సభలో చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్న విషయం తెలిసిందే. విపక్షాల నిరసనల నేపథ్యంలో ప్రధానిని సభకు రావొద్దని సూచించినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఈ క్రమంలోనే స్పీకర్ ఛాంబర్ లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన విజువల్స్ ను కూడా ఆయన పంచుకున్నారు. ‘ఇది ఒక కాంగ్రెస్ ఎంపీ చట్టవిరుద్ధంగా తీసిన వీడియో క్లిప్. 20-25 మంది ఆ పార్టీ ఎంపీలు స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లారు. ఆయనను దుర్భాషలాడటంతో పాటు ప్రధాని మోదీ పై కూడా బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ చర్చలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. ఎంపీలు ఇలా బెదిరింపులకు పాల్పడటాన్ని మేం ఎప్పటికీ ప్రోత్సహించమని రిజిజు పేర్కొన్నారు. తాజా వీడియోలో.. స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్ లోపల గట్టిగా మాట్లాడుతూ పలువురు ఎంపీలు ఉన్నారు. ఇంకా కేంద్ర మంత్రితో సహా పలువురు బీజేపీ ఎంపీలు పక్కన నిల్చొని ఉండడం అందులో కన్పిస్తుంది.