భారత్ కు మరిన్ని రఫెల్ జెట్స్..కేంద్రం కీలక నిర్ణయం..!

Spread the love

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ తో  అతిపెద్ద రక్షణ ఒప్పందానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. 114 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయని తెలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందంకు  ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.ఈ 114లో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్  (IAF)లో విధులు నిర్వర్తించనున్నాయి. అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబ్లీ వంటి వాటి కోసం ఫ్రాన్స్ కు  చెందిన రఫేల్ మాతృ సం డసో ఏవియేషన్.. భారత్ లోని ప్రైవేట్  రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఇప్పటికే 36 రఫేల్ ఫైటర్ జెట్స్  ఉన్నాయి.