ఈరోజు యూరప్ మరియు భారతదేశం చరిత్రను సృష్టిస్తున్నాయని యూరోపియన్ యూనియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సుల ఓన్ డెర్ లెయెన్ అన్నారు. అన్ని ఒప్పందాలకల్లా అత్యున్నతమైన ఒప్పందాన్ని ముగించామని ఆమె ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.రెండు వైపులా ప్రయోజనం చేకూరే విధంగా, రెండు బిలియన్ల ప్రజలతో కూడిన స్వేచ్ఛా వాణిజ్య మండలిని మేము ఏర్పాటు చేశాము.ఇది కేవలం ఆరంభం మాత్రమే.మేము మా వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ ఒప్పందం మా వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు మరియు ఆవిష్కరణలకు ఊతమిస్తుందని భారత ప్రధాని మోడీ బదులిచ్చారు. స్థిరమైన, సంపన్నమైన మరియు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండే ఆర్థిక సంబంధాన్ని రూపొందించాలనే ఇరు దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.