దేశవ్యాప్తంగా 45 చోట్ల 18వ రోజ్ గారు మేళాను నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 61వేల మందికి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ యువతకు ఉద్యోగమే లక్ష్యంగా ప్రారంభమైన రోజ్ గారు మేళా కార్యక్రమం నేడు ఒక సంస్థగా మారిందన్నారు. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా లక్షల మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. రీఫార్మ్స్ ఎక్స్ ప్రెస్ గా భారత్ ఎదుగుతుందని ప్రధాని స్పష్టం చేశారు.ప్రపంచంలో ఎక్కువ యువ జనాభా కలిగిన దేశం మనదేనని వారికి మంచి అవకాశాలు కల్పించడడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని దానికోసం నిబద్దతతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. దీంతో దేశ విదేశాల్లో ఉన్న భారతీయ యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా యువతకు నియామకపత్రాలు అందించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.