ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్ట్లో కలిసి పాల్గొన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ప్రధాని పర్యటన కొనసాగుతోంది. అహ్మదాబాద్ లోని సబర్మతి నదీతీరంలో జరుగుతోన్న ఈ ఫెస్టివల్లో ఛాన్స్లర్ తో కలిసి గాలిపటాన్ని ప్రధాన మంత్రి మోడీ ఎగురవేశారు. అంతర్జాతీయ పతంగుల పండుగ (కైట్ ఫెస్టివల్) సమయంలో అహ్మదాబాద్ ఆకాశం రంగురంగులతో, ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన వేడుకను ఫెడరల్ ఛాన్స్లర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్‌కు చూపించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన స్వయంగా గాలిపటాన్ని ఎగురవేయడానికి ప్రయత్నించడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది! అంటూ ప్రధాని మోడీ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ ఫెస్టివల్ లో 50 దేశాలకు చెందిన ఔత్సాహికులు పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో హనుమాన్ పతంగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత ఏడాది ఈ ఫెస్టివల్ కోసం 3.83 లక్షల మంది టూరిస్ట్ లు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య 5 లక్షలకు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఇక్కడికి వచ్చేవారు ధోలవీర, స్టాట్యూ ఆఫ్ యూనిటీని కూడా సందర్శిస్తున్నారని, దీనివల్ల రాష్ట్ర పర్యాటకానికి మరింత ఊపు లభిస్తోంది.