గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సమ్మక్క – సారలమ్మ మేడారం మహా జాతర బ్రోచర్, పోస్టర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా మేడారం జాతరకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సంబరాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ ని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాటు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఆహ్వానించారు.