ముంబయి మేయర్ గా ఎన్నికైన మహాయుతి అభ్యర్థి రితూ తావ్డే

Spread the love

ముంబయి మేయర్ గా మహాయుతి కూటమికి చెందిన  అభ్యర్థి రితూ తావ్డే  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 25 ఏళ్లలో బీజేపీకి ఈ పదవి దక్కడం ఇదే మొదటిసారి. స్థానికంగా బీజేపీ సీనియర్ నేత అయిన రితూ ఘట్కోపర్ వెస్ట్ నుంచి మూడుసార్లు కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. వార్డు స్థాయి నుండి  రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇక  227 సీట్ల బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో 89 సీట్లు బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివ సేన 29 స్థానాల్లో విజయం సాధించింది.ఉద్దవ్ శివసేన 65, మిత్రపక్షాలైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన 6, శరద్ పవార్ ఎన్సీపీ 1, అజిత్ పవార్ ఎన్సీపీ 3,సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాలు గెలుచుకున్నాయి.