బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

Spread the love

భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో జరిగిన ఎన్నికలో నితిన్ కొత్త జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన రేపు ఉదయం 11గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 46 సంవత్సరాల నితిన్ నబీన్ బీహార్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బిజెపి ఇన్‌ఛార్జ్‌ గా మరియు బీహార్ ప్రభుత్వంలో నగరాభివృద్ధి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నితిన్ నబీన్ దివంగత బిజెపి నాయకుడు నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన పట్టును నిరూపించుకున్నారు. గతేడాది డిసెంబర్ లో నితిన్ ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాయస్థ సామాజికవర్గానికి చెందిన నితిన్‌కు ఆరెస్సెస్‌ (RSS) బ్యాక్ గ్రౌండ్  ఉన్నట్లు తెలుస్తోంది. బిహార్ రాజధాని పట్నాలోని బాంకీపుర్‌ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ట్రాక్ రికార్డు కూడా నితిన్ నబీన్ సొంతం.