భారత మహిళల బ్యాడ్మింటన్ సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గేమ్ కు గుడ్ బై చెప్పేసింది. ఎన్నో అద్భుత విజయాలతో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన సైనా వీడ్కోలు ప్రకటించింది. గత కొంత కాలంగా ఆమె ఆటకు దూరంగా ఉన్నా తాజాగా వీడ్కోలు విషయాన్ని ఖరారు చేసింది. ఆమె ఆఖరిగా 2023లో సింగపూర్ ఓపెన్ లో ఆడింది. రెండేళ్ల కిందటే నేను ఆడడం మానేశాను. నా అంతట నేను ఆటలోకి వచ్చా. నా అంతట నేను నిష్క్రమిస్తున్నాను. అందుకే ప్రకటించడం అవసరం లేదనుకున్నాను. ఇంకెంతమాత్రం ఆడగలిగే సామర్థ్యం లేనప్పుడు కథ ముగిసినట్లే మరేం పర్వాలేదని ఆమె ఒక పాడ్ కాస్ట్ లో చెప్పారు. మోకాళ్ల సమస్య తన వీడ్కలుకు కారణమని ఆమె తెలిపారు.