బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం..మోదీ ప్రశంసలు

Spread the love

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నితిన్ నబీన్ ను ప్రశంసించారు. ఇప్పుడు నబీన్ తనకు బాస్ అంటూ కీలక కామెంట్స్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని  పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నబీన్ తనకు బాస్ అని, తాను సాధారణ పార్టీ కార్యకర్త అని అన్నారు. ‘బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరు. ఇక్కడ  నిర్ణయాలు, ఎంపిక అన్నీ ప్రజాస్వామ్యయుతంగానే ఉంటాయి. దేశ సేవ, ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారని కొనియాడారు. గతంలో అద్వానీ, వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఘన విజయాలు సాధించాం. అందరి కృషితోనే మూడుసార్లు అధికారంలోకి వచ్చేలాపార్టీ ఎదిగిందని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పార్టీ నిర్మాణం బలంగా  ఉందని బీజేపీ కార్యకర్తను అనిపించుకోవడమే నాకు గర్వకారణమని అన్నారు. పార్టీలో ప్రత్యేకంగా పదవులు, బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్క కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు.  బాధ్యతలు మారతాయి అయితే  లక్ష్యం మారదు. నాయకత్వం మారినా  మన గమ్యం మారదంటూ మోదీ పేర్కొన్నారు. బీజేపీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు.