ఫిబ్రవరి 5,6 తేదీలలో బంగాళాఖాతంపై NOTAM జారీ

Spread the love

భారత్ బంగాళాఖాతంలో నోటమ్ జారీ చేసింది. NOTAM అంటే Notice to Airmen (ప్రస్తుతం దీనిని Notice to Air Missions అని కూడా పిలుస్తున్నారు). సాధారణంగా పైలట్లు విమానాన్ని నడిపే ముందు వాతావరణం, వెళ్లే రూట్ మరియు ల్యాండ్ అయ్యే ఎయిర్‌పోర్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. అయితే, ఆకస్మికంగా జరిగే మార్పుల గురించి (ఉదాహరణకు: రన్‌వే మూసివేత, సిగ్నల్స్ పని చేయకపోవడం) పైలట్‌లకు సమాచారం అందించే వ్యవస్థే ఈ NOTAM. NOTAM ఎందుకు అవసరం? విమాన ప్రయాణం సురక్షితంగా సాగడానికి ఇది అత్యవసరం. ఏదైనా రన్‌వే రిపేర్ వల్ల మూసివేసినా లేదా అక్కడ మంచు పేరుకుపోయినా హెచ్చరిస్తారు. మిలిటరీ వాళ్ళు మిస్సైల్ టెస్ట్ లు వంటివి  చేస్తున్నా ఆ ప్రాంతం మీదుగా వెళ్లవద్దని చెబుతారు. ఎయిర్ పోర్టుల్లో రేడియో సిగ్నల్స్ లేదా రన్‌వే లైట్లు పని చేయనప్పుడు ఈ నోటీసు ఇస్తారు. ముఖ్యమైనటువంటి ప్రముఖులు ప్రయాణించేటప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే నిర్దిష్ట పరిస్థితుల నేపథ్యంలో నిర్దిష్ట పరిధిలో నిర్దిష్ట కాలంలో ప్రమాదాలు, ప్రయాణ పరిమితులకు సంబంధించి ప్రజలు ప్రయాణించే పౌర మరియు సైనిక విమానయానానికి తెలిపేందుకు ఇచ్చే నోటిసునే NOTAM అని పిలుస్తారు. సాధారణంగా మిస్సైల్ టెస్టులు, యుద్ధ పరిస్థితులు, సైనిక విన్యాసాల సమయంలో ఇవి ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా జారీ చేసిన NOTAM ఫిబ్రవరి 5,6 తేదీలలో బంగాళాఖాతంలో 3,190 కిమీ పరిధిలో విమానాలను అనుమతించబోమని ఇచ్చింది. మిస్సైల్ టెస్ట్ కోసమే ఇది ఇచ్చినట్లు పలు ఇంగ్లీష్ మీడియా కథనాలు వస్తున్నాయి.