కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతి?

Spread the love

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేదార్ నాథ్, బద్రీనాథ్, ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతిస్తారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్-కేదార్ నాథ్ దేవాలయ  కమిటీ ప్రతిపాదించింది. త్వరలో జరగనున్న ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తారు. ఈ విషయాన్ని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఛైర్మెన్ హేమంత్ ద్వివేది ధ్రువీకరించారు. ఇక ఈరెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే మిగతా దేవాలయాల్లోనూ ఇదే ఎంట్రీ నిబంధనవర్తించనున్నట్లు తెలిపారు.  ఇప్పటికే గంగోత్రి ధామ్ లో హిందూయేతరులు ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఈ మేరకు తాజాగా  జరిగిన శ్రీ గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో దీనిపైఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ ప్రవేశాల పైనాప్రతిపాదనలు వచ్చాయి. అయితే, ఈ కొత్త నిబంధనలు ఎప్పటినుంచి అమల్లోకి తెస్తారనేది తెలియాల్సి ఉంది.