కె.టి.ఆర్ సారథ్యంలో  రేపు గవర్నర్ ను కలవనున్న బీ.ఆర్.ఎస్ బృందం 

Spread the love

భారత రాష్ట్ర సమితి బృందం రేపు గవర్నర్‌ను కలవనుంది.  ఆ పార్టీ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్. సారథ్యంలో గవర్నర్‌ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేయనున్నారు.  సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క… ఇతర మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. సాక్షాధారాలతో కూడిన నివేదిక ఇవ్వనున్నట్లు  బీఆర్ఎస్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని, ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకుందని పేర్కొంది. ఈ భేటీ సందర్భంగా, సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు సమర్పించనున్నారని తెలిపింది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు.