విజిల్ సింబల్ తో ఎన్నికల బరిలోకి దిగనున్న విజయ్

Spread the love

ఈ సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల బరిలో విజయ్ కూడా తన తమిళ వెట్రి కళగం పార్టీతో దిగనున్నారు. కాగా, ఆయన పార్టీకి గుర్తును ఎన్నికల సంఘం ఖరారు చేసింది. విజిల్ గుర్తును విజయ్ పార్టీకి కేటాయించింది. విజయ్ ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. అయితే ప్రజలు ఆయనను ఏమేరకు ఆదరిస్తారన్నది చూడాల్సి ఉంది. ఇక మరో తమిళ నటుడు కమల్ హాసన్ కు చెందిన ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీ కూడా ఎన్నికల బరిలో ఉంది. ఇక ఈ పార్టీకి ‘టార్చ్ లైట్’ గుర్తును ఈసీ కేటాయించింది. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆ పార్టీ ఇదే గుర్తుపై పోటీచేసింది.